|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:27 PM
గత ప్రభుత్వంలో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. మంగళవారం జరిగిన కేబినేట్ సమావేశంలో చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం ఇద్దామని సీఎం ప్రతిపాదించారు. మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కుటుంబానికి పెద్దదిక్కయిన తోట చంద్రయ్య హత్యతో ఆయన కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందుల పాలైందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఆదుకోవాల్సి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం పట్ల పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
Latest News