ప్రేమ పేరుతో 15 ఏళ్ల బాలికని మోసంచేసిన యువకుడు
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 12:23 PM

ప్రేమ, పెళ్లి పేరిట బాలికను శారీరకంగా లొంగదీసుకుని మోసం చేసిన నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ గ్రామానికి చెందిన పి.నారాయణ(25)పై నెల్లిమర్ల పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నారాయణకు ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆ బాలికను నమ్మించి గర్భవతిని చేసి ఆ తర్వాత అబార్షన్‌ చేయించాడు. పెళ్లికి ససేమిరా అనడంతో నెల్లిమర్ల పోలీసులను బాలిక ఆశ్రయించింది. దాంతో నెల్లిమర్ల పోలీసులు నారాయణపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM