|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:28 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 81,345 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 24,727 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్-30 సూచీలోని ప్రధాన షేర్లలో సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు లాభాల్లో కనిపించాయి ఎటర్నల్, అదానీ పోర్ట్స్, కోటక్, బజాజ్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మొత్తంగా మార్కెట్ ధోరణి సానుకూలంగా ఉండగా, ఇన్వెస్టర్లు ముఖ్యమైన కంపెనీల ఫలితాలు మరియు అంతర్జాతీయ సూచీలపై దృష్టి పెట్టి ట్రేడింగ్ కొనసాగిస్తున్నారు.