|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 10:53 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 81,345 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 24,727 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో.. సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎటర్నల్, అదానీ పోర్ట్స్, కోటక్, బజాజ్, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 30 సూచీలో.. సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, బజాజ్‌ఫిన్‌సర్వ్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎటర్నల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 66.39 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,307 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.
Latest News