|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 10:51 AM
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాల నైతికంగా పతనం అయ్యాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలనలో కేసులు ఎదుర్కోవాలని.. అలాగే జైళ్లకూ వెళ్లగలగాలని, అలాంటి వారే ఇప్పుడు రాజకీయాలు చేయగలరని, రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలరని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కి చెందిన వైయస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ మాట్లాడుతూ.....ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడొద్దు. జైళ్లకు పంపినా, చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటాం అంటేనే, అలా ఉండగలిగినప్పుడే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఆ విధంగా ఈరోజు రాజకీయాలు తయారయ్యాయి అని అన్నారు.
Latest News