|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:53 PM
సీఎం చంద్రబాబు నాయుడుకి గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ సోమవారం లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య ఇటీవల జరిగిన ఒప్పందంపై బిల్‌గేట్స్ ప్రస్తావించారు. చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని బిల్ గేట్స్ అన్నారు. మంచి వాతావరణంలో సంప్రదింపులు జరపడం సంతోషంగా ఉందన్నారు. . ఆరోగ్య రంగాన్ని పటిష్ట పరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్‌టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడం, వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మోనిటరింగ్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి మైక్రోన్యూట్రీయంట్లు అందించే అంశాలపై ఇరువురం చర్చించామని బిల్‌గేట్స్ గుర్తు చేశారు.
Latest News