|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:51 PM
వైసీపీ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఆర్థికంగా దెబ్బతిన్నదని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర, రాష్ట్రాల నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. గ్రామాల్లో కనీసం తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవని చెప్పారు. గతంలో ఎప్పుడూ రెండోపంటకు లక్షాయాభై వేల ఎకరాలకు మించి సాగునీరు ఇవ్వలేదని.. ఈ ఏడాది 5లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. జల జీవన్ మిషన్‌లో ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చామని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామానారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలకు రూ.1200 కోట్ల నిధుల కేటాయింపులు చేశామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో పనిచేస్తూ ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా చేశారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి ఉద్ఘాటించారు. గతంలో ఏ రోడ్డులో వెళ్లినా గుంతలు ఉండేవని చెప్పుకొచ్చారు. రోడ్లకు తమ ప్రభుత్వంలో రూ.850కోట్లు కేటాయించి, గుంతలు లేకుండా చేశామని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి వెల్లడించారు.
Latest News