|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:09 PM
నేడు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. 25 అంశాల అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎస్ఐపీబీ 6వ సమావేశంలో అమోదించిన పలు సంస్థల పెట్టుబడులకు మంత్రి మండలి అమోదం తెలపనుంది. ఏపీ లెదర్ అండ్ ఫుట్‌వేర్ పాలసీ 4.0కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఓకే చెప్పనుంది.దీని ద్వారా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంది. వచ్చే జూన్ 12వ తేదీ నాటికి కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి అవుతుండటంతో ఈ సమావేశంలో చర్చించనున్నారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌కు పాలన పరమైన అనుమతులకు అమోదం పైనా కేబినెట్‌లో మాట్లాడనున్నారు. ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసే అంశంపై చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీలపై కూడా ఈ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రి మండలి చర్చించనుంది.
Latest News