|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:05 PM
స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టంగుటూరి ప్రకాశం పంతులుకు నివాళి అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా వెలుగొంది ‘ఆంధ్రకేసరి’గా కీర్తిప్రతిష్ఠలు పొందిన ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని బ్రిటీష్ తుపాకీకి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేం. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం ఆదర్శవంతం. ఆయనకు మరొక్కమారు ఘన నివాళి ఘటిస్తున్నా’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Latest News