|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:59 AM
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు.. అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిర అయిన విజయవాడ వాసులు మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు. విజయవాడలో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు కర్నాటకలోని గంగావతి, సిరుగుప్ప, హగరిలో కురిసిన వర్షాలకు తుంగభద్రలో ప్రవాహం పెరిగింది. దీంతో తుంగభద్ర ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. మంత్రాలయం వద్ద 308.300 నీటి మట్టం నమోదు అయ్యింది. కోసిగి మండల పరిధిలో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Latest News