|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:58 AM
ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుండగా.. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Latest News