|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:55 AM
వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విషాదాలు చోటు చేసుకుంది. శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో తండ్రీ కొడుకులు పిడుగుపాటుకు గురయ్యారు. పిడుగుపాటుకు గురైన తండ్రి గేదెల రాజారావు మృతి చెందగా.. కుమారుడు గేదెల నాగార్జునకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన నాగార్జునను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం నగరం బలగలో గ్రామ దేవత పండగల నేపథ్యంలో తండ్రీ, కొడుకులు నదిలో స్నానానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అలానే కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో నాటు పడవ బోల్తా పడింది. ఉప్పాడ తీరం నుంచి ముగ్గురు వ్యక్తులు నాటు పడవపై సముద్రం మధ్యలో ఉన్న హోప్ హైలాండ్‌కు వెళ్తుండగా కెరటాల తాకిడికి పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఈదుకుంటూ సురక్షితంగా హోప్ ఐలాండ్ చేరుకోగా.. మెరుగు శ్యామ్(20) అనే యువకుడు గల్లంతయ్యాడు.
Latest News