|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:09 PM
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదేశించారు. వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ సహాయ సహకారాలు అందించాలని, అవసరమైతే ఉద్యోగులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈదురు గాలుల కారణంగా చెట్లు కూలిన ప్రాంతాల్లో రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Latest News