ఆదోని మునిసిపాలిటీల్లో ఎగిరిన వైసీపీ జెండా
 

by Suryaa Desk | Tue, May 20, 2025, 11:39 AM

రాష్ట్రంలో సోమ‌వారం జ‌రిగిన ప‌లు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు స‌త్తా చాటారు. ఏక‌గ్రీవంగా ఎన్నికై ప‌లు మున్సిపాలిటీలు, మండ‌ల ప‌రిష‌త్‌ల‌ను సొంతం చేసుకున్నారు.   గ్రేటర్‌ విశాఖపట్నంతోపాటు మరో నాలుగు మున్సిపాలిటీలు, రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు నిన్న మరో విడత ఎన్నికలు నిర్వహించారు. గ్రేటర్‌ వి­శా­ఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ పదవితోపాటు బొబ్బిలి(విజయనగ రం), ఆదోని (కర్నూలు), తిరువూరు (ఎన్టీఆర్‌), కది­రి (శ్రీ సత్యసాయి) మున్సిపాలిటీల చైర్మన్‌ పద­వులకు, కదిరి మున్సిపాలిటీలో రెండు వైస్‌ చైర్మన్‌ పదవులకు పరోక్ష ఎన్నికలు జరిగాయి. చాలా చోట్ల కోరం లేక ఎన్నిక‌ను వాయిదా వేశారు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు. 

Latest News
KPIT Technologies founder Ravi Pandit passes away at 71 Fri, May 08, 2026, 11:25 AM
Tata Trusts defers key board meetings to May 16 amid legal challenges Fri, May 08, 2026, 11:22 AM
Ismaila Sarr secures Conference League final berth for Crystal Palace Fri, May 08, 2026, 11:17 AM
Dollar dominance faces China test Fri, May 08, 2026, 11:15 AM
MoS Pabitra Margherita arrives in Costa Rica to attend Presidential swearing-in Fri, May 08, 2026, 10:57 AM