|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 11:37 AM
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైయస్ఆర్‌సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైయస్ఆర్‌సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు.
Latest News