|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 11:10 AM
విజయవాడ జైలు అధికారులను హటాత్తుగా మార్చడం వెనుక చంద్రబాబు రచించిన మరో భారీ కుట్ర ఉందని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో అరెస్ట్ అయినా వారంతా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నందున వారిని వేధించేందుకే తాము చెప్పినట్లు నడుచుకునే అధికారులను అక్కడ నియమించారని అన్నారు. ఒకవైపు సంబంధం లేని అంశాల్లో ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు బనాయించడం, మరోవైపు అక్రమ అరెస్ట్‌లతో రిమాండ్‌కు పంపి, వారిని జైలులో హింసించాలన్నదే చంద్రబాబు కుతంత్రంగా కనిపిస్తోంని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News