|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 11:17 AM
లిక్కర్ స్కాంలో అసలు దోషి చంద్రబాబే అని, ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన ఆయన, సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆక్షేపించారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో బార్లకు మేలు చేసిన చంద్రబాబు, చివరకు క్యాబినెట్‌కు కూడా తెలియకుండా ఆ నిర్ణయం తీసుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.... నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి దేశంలో చంద్రబాబు ఒక్కేడేనేమో!. తీరా ఓటేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముందుబాబులను కూడా వంచించాడు. రేట్లు తగ్గించకపోగా పెంచేసి జేబులు ఖాళీ చేస్తున్నాడు. వైయస్ఆర్‌సీపీని, వైయస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తప్పుడు కేసులతో వేధించాలని చూస్తున్నారు. లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్టు వాంగ్మూలాలు సృష్టించి మాజీ ఐఏఎస్ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి కృష్ణమోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా, బెవరేజెస్ కార్పొరేషన్‌లో కొందరు ఉద్యోగులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. లిక్కర్ స్కాంపై కూటమి ప్రభుత్వం వేసిన ‘సిట్’ లో కొనసాగలేనని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు బయటకు వెళ్లారంటేనే కేసుల వెనుక డొల్లతనం బయటపడుతుంది అని తెలిపారు.
Latest News