|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 11:05 AM
ఏడాది పాలనలో చంద్రబాబు ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే లిక్కర్ స్కామ్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సీఎంఓలో పనిచేసిన అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను లేని లిక్కర్ స్కామ్‌లో దోషులుగా చూపడం, వారి అరెస్ట్ దీనిలో భాగమేనని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఒక్క ఎన్నికల హామీని కూడా సక్రమంగా అమలు చేయక ప్రజాగ్రహాన్ని చవిచూస్తోందని అన్నారు. దీని నుంచి బయటపడేందుకు గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Latest News