|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 05:59 PM
దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యపై మన దేశ వాణిని అంతర్జాతీయ వేదికలపై వినిపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో తన సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు."ఇటీవలి పరిణామాలపై మన దేశ దృక్పథాన్ని ఐదు కీలక రాజధానులకు తెలియజేసేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా భారత ప్రభుత్వం నన్ను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నాను. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో, నా సేవలు అవసరమైనప్పుడు నేను వెనుకాడను. జై హింద్!" అని థరూర్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
Latest News