|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 05:53 PM
రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇవాళ(శనివారం) జరిగిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, వైస్ ప్రెసిడెంట్‌గా కృష్ణ, కార్యదర్శిగా యలమంచిలి శ్రీకాంత్‌లను ఎన్నుకున్నారు. అలాగే 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను యలమంచిలి శ్రీకాంత్ ప్రకటించారు. ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అన్వేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్‌లు అబ్జర్వర్లుగా ఈ ఎన్నిక జరిగింది. కబడ్డీ ఆటలో ప్రతిభ కనబరచిన క్రీడాకారుడు మణికంఠకు రూ.3 లక్షల చెక్‌ను అందజేశారు.ఈ సందర్భంగా ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికైందని తెలిపారు. ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అన్వేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్‌లు అబ్జర్వర్లుగా ఈ ఎన్నిక జరిగిందని చెప్పారు. ఏపీలో సీఎం చంద్రబాబు ఆదేశించిన విధంగా కబడ్డీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏకేఐఎఫ్ గైడ్‌లైన్స్ అనుగుణంగా పని చేస్తామని చెప్పారు. త్వరలో బీచ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తామని యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు.
Latest News