|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 05:50 PM
కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీ క్యాంప్ రైతుబజార్‌కు సీఎం వెళ్ళారు. అక్కడ రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్ధాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించండని ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని కోరారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్రలో భాగంగా ఈ మేరకు ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలని ప్రజలకు సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతి మూడో శనివారం శుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మెచ్చుకునేలా రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కర్నూలులోని రైతుబజార్‌ను రూ.6 కోట్లు కేటాయించి ఆధునీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.
Latest News