|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 11:18 AM
ఒడిశాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పిడుగులు పడి గత రెండు రోజుల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అలాగే, పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ వరుస ఘటనలతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ కూడా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.