|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 11:19 AM
వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఎస్పీ కృష్ణకాంత్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుని రంగంలోకి దించారు. కాకాణి కోసం బెంగుళూరు, హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల్లో పది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయడంతో కాకాణికి అరెస్ట్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. కోర్టులో లొంగిపోతారంటూ చర్చలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు శరవేగంగా ఆధారాలు సేకరించి కోర్టుకి అందించారు. పోలీసుల నోటీసులు నిందితులు తీసుకోలేదు. పైగా సాక్షులపై కాకాణి తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసుల విచారణకి హాజరు కాకుండా ఉన్న సంగతి తెలిసిందే.
Latest News