|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 11:17 AM
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రేపు (ఆదివారం) జరగనుంది. పరీక్ష వివరాలు ఇలా ఉన్నాయి:
పేపర్-1: ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
పేపర్-2: మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు
పరీక్ష నిబంధనలు:
విద్యార్థులు డిజిటల్/అనలాగ్ వాచ్‌లు, ఉంగరాలు, చెవిపోగులు, ముక్కుపుల్లలు, చైన్లు, నెక్లెస్‌లు, పెండెంట్‌లు, బ్యాడ్జీలు, హెయిర్ పిన్నులు వంటివి ధరించకూడదు.
అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి) తప్పనిసరిగా తీసుకెళ్లాలి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.