|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 11:14 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మరియు గదుల కోటాను ఆన్‌లైన్‌లో ఈ నెల 24వ తేదీన విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా, దర్శనం టికెట్లు ఉదయం 10 గంటలకు, గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే, ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కూడా విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.