|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 10:48 AM
రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్ఆర్‌సీపీని టార్గెట్ చేశారు, మా పార్టీ నాయకులనే కాదు అధికారులను కూడా వేధించడం అత్యంత జుగుప్సాకరం అని మాజీ ఎమ్మెల్యే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ.... సూపర్ సిక్స్ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు, ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు . అధికారులపై వ్యక్తిగత కక్షలు, అరెస్ట్‌లు దారుణం. రేపుటి రోజు ఏపీలో ఏ ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ పనిచేయరు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, తగిన బుద్ది చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది అని హెచ్చరించారు.
Latest News