|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 10:29 AM
మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్టమోహన్ రెడ్డిల అరెస్టును ఖండిస్తున్నట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. అయన మాట్లాడుతూ.... చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు చేస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలో ఆధారాలు లేకపోయినా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. వైయస్ఆర్‌సీపీని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు. ఆ ప్రక్రియలో అంతులేని దారుణ వేధింపులు. ఇది ఇంకా కొనసాగితే ఏ మాత్రం సహించబోము. ప్రభుత్వ తీరును కచ్చితంగా ప్రజల్లో ఎండగడతాం. అక్రమ కేసుల్లో అరెస్టయిన వారికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. తగిన న్యాయ సహాయం అందిస్తాం అని తెలిపారు.
Latest News