|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 10:35 AM
సీఎం వైయస్ జగన్ హయాంలో అయన వద్ద కార్యదర్శిగా పని చేసినఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీగా పని చేసిన కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసినప్పటికీ, వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర నాయకుడు జల్లా సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఇదే కేసును ఒకానొక దశలో రాజకీయ దురుద్దేశంతో నమోదు చేయబడిన కేసుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని అన్నారు. అయన మాట్లాడుతూ... రాజకీయ దురుద్దేశంతో ప్రతీకారం తీర్చుకోవడానికి నమోదు చేయబడిన కేసుగా ఇది కనబడుతోందని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, జగన్‌గారి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. విచారణ పురోగతిలో ఉందని, ఇంకా లోతైన విచారణ జరగాల్సిన అవసరముందని చెబుతూ.. కింది కోర్టులో బెయిల్‌కు అప్లై చేసుకోవచ్చని సూచించింది. 2014–19 మధ్య చంద్రబాబు తన పాలనలో చేసిన అనేక అక్రమాలపై ఆ తర్వాత నమోదైన.. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, లిక్కర్ స్కామ్, ఏపీ ఫైబర్‌నెట్ స్కాం, అక్రమ మైనింగ్ కేసుల్లో తన నిర్దోషిత్వం నిరూపించుకోలేక, కక్ష పూరితంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంటూ కేసు నమోదు చేసినట్లు కనపడుతోంది. అందుకే ఎపెక్స్ కోర్టు కూడా ఈ కేసును దురుద్దేశంతో ప్రతీకారం తీర్చుకోవడానికి నమోదు చేసినట్లుగా ఉందని అభిప్రాయపడింది అని అన్నారు.
Latest News