ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: రక్షణ బడ్జెట్‌కు అదనంగా రూ.50,000 కోట్లు!
 

by Suryaa Desk | Fri, May 16, 2025, 11:24 AM

ఆపరేషన్ సిందూర్ తరువాత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం కోసం కేంద్రం రక్షణ బడ్జెట్‌ పెంపును పరిశీలిస్తోంది. రక్షణ బలగాలకు నూతన ఆయుధాలు, సాంకేతిక పరికరాల కొనుగోలుకు రూ.50,000 కోట్ల అదనపు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ కేటాయింపును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఇప్పటికే రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ రంగానికి కేటాయించింది.గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2014-15లో రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 6.81 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత కేటాయింపులు మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 13.45 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

Latest News
Sydney terror attack: Australia marks Day of Reflection for victims, orders intelligence review Sun, Dec 21, 2025, 01:43 PM
PM Modi interacts with Assam students aboard Brahmaputra cruise Sun, Dec 21, 2025, 01:37 PM
Railway fares to go up from Dec 26, to yield Rs 600 crore extra revenue Sun, Dec 21, 2025, 01:31 PM
Anant Raj shares crash 35 pc in 2025, mark worst year in 6 years Sun, Dec 21, 2025, 01:23 PM
Bus rams into parked truck in Telangana's Khammam, one killed Sun, Dec 21, 2025, 01:20 PM