|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 11:21 AM
లిక్కర్ వ్యవహారంలో సిట్ విచారణ తీరు దారుణంగా ఉందని వైయస్ఆర్‌సీపీ లీగల్ విభాగం అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆక్షేపించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.అయన మాట్లాడుతూ.... లిక్కర్ వ్యవహారంలో సిట్ విచారణ తీరు దారుణంగా ఉంది. చట్టాన్ని, నియమాల్ని, నిబంధనలను పట్టించుకోవడంలేదు. దర్యాప్తు కోణంలో కాకుండా ఎలా వేధించాలన్న కోణంలో సిట్ వ్యవహరిస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల వ్యవహారంలో సిట్ కక్షపూరిత ధోరణి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకు వీళ్లిద్దరూ సిట్ విచారణకు హాజరయ్యారు. రాత్రి 10:30 వరకూ వాళ్లిద్దరీ పంపించలేదు . పన్నెండున్నర గంటల పైబడి విచారణ చేస్తున్నారు. ఇది పూర్తిగా నిబందనలకు విరుద్ధం . ఇద్దరూ సీనియర్ సిటిజన్స్ అన్న విషయాన్నికూడా సిట్ మరిచిపోయింది. సిట్‌కు చట్టమన్నా, న్యాయస్థానాలన్నా, రాజ్యాంగమన్నా, సుప్రీం కోర్టు తీర్పులన్నా ఎలాంటి గౌరవం లేదు. పదేపదే కోర్టులు హెచ్చరిస్తున్నా వీళ్ల తీరు మారలేదు. వ్యక్తుల స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు. లిక్కర్ వ్యవహారంలోనే ఒక నిందితుడి పట్ల సిట్ ఇలానే వ్యవహరిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టింది. సీనియర్ సిటిజన్స్ వ్యవహారంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పింది. అతడి విషయంలో ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తర్వాత విచారణ వద్దని చెప్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాని, కోర్టు తీర్పులు సిట్‌కు ఎక్కడం లేదు . ఏదో జరిగిపోయిందన్న భావనను ప్రజలకు కల్పించడానికి ఇలాంటి ఎత్తుగడలకు దిగుతోంది. ఈ అంశాలన్నింటినీ గౌరవ న్యాయస్థానం దృష్టికి వెళ్తున్నాం. సిట్ అధికారుల వ్యవహార తీరును కోర్టుకు తెలియజేస్తాం. సిట్ అధికారులు రాజకీయ నాయకుల్లా వ్యవహరించడం సరికాదు అని మండిపడ్డారు.
Latest News