|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 11:28 AM
చైనాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మయన్మార్ (బర్మా), చైనాలోని యునాన్‌లోని బావోషాన్ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.నిన్న టర్కీలో కూడా భూకంపం సంభవించింది. అయితే నేటి ఉదయం చైనాలో సంభవించిన భూకంపానికి ప్రజలు ఆందోళన చెందారు. ఎంత మేరకు ప్రాణ,ఆస్తి నష్టం సంభవించిందన్నది కూడా తెలియరాలేదు. అయితే ప్రాణనష్టం లేదని, ఆస్తి నష్టం తక్కువగానే ఉందని అందుతున్న ప్రాధమిక సమాచారం మేరకు తెలుస్తుంది.
Latest News