|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:53 PM
నేడు కడప జిల్లాకు సీఎం జగన్ రానున్నారు. వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇక్కడే శనివారం ప్రకటించనున్నారు. ఉదయం 10:45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు.
Latest News