|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:24 PM
కళ్యాణదుర్గం పట్టణంలోని ఉన్నం క్యాంపు కార్యాలయం నందు భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా శనివారం టీడీపీ మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయచౌదరి మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జిపి నారాయణ, నాయకులు పాల్గొన్నారు.
Latest News