|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:43 AM
జనసేన ఇన్‌ఛార్జ్ పరుచూరి భాస్కరరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో పరుచూరి మాట్లాడుతూ.. ‘అనకాపల్లి అసెంబ్లీ జనసేన ఇన్‌ఛార్జ్‌గా కొణతాల రామకృష్ణను ప్రకటించారు.
16 రోజులుగా పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ దొరకట్లేదు. మంగళగిరి కార్యాలయం వద్ద పడిగాపులు కాసినా పట్టించుకోలేదు. సీటు ఇవ్వలేదని బాధ లేదు. కానీ గౌరవం, విలువ లేని పార్టీలో కొనసాగలేను. అందుకే రాజీనామా చేస్తున్నా.’ అని అన్నారు.