|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 04:23 PM
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ షాకిచ్చారు. కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
దీంతో ఇక్కడ నుంచి సీటు వస్తుందని ఆశించిన జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ పోతిన మహేశ్ ఖంగుతిన్నారు. కాగా, సీటు మహేష్‌కు ఇవ్వకపోవడంతో పవన్ తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ తమను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.