|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 03:01 PM
పౌరసత్వ సవరణ చట్టం - సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు CAAను అమలు చేయబోమని ప్రకటించాయి.
అయితే ఏదైనా చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలు అడ్డుకునే అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చని అంటున్నారు. పైగా CAA కోసం వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకునేవారిని ప్రభుత్వాలు అడ్డుకోలేవని తెలిపారు.