|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:59 PM
టీడీపీ మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సెకండ్ లిస్ట్‌లో ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను అధిష్టానం ప్రకటించలేదు.
పెనమలూరు ఇన్‌ఛార్జ్ బోడె ప్రసాద్‌కు టికెట్ ఇవ్వలేమని అధిష్టానం ప్రకటించింది. దాంతో ఇక్కడ ఎవరు పోటీ చేయబోతున్నారనే సస్పెన్స్ నెలకొంది. మరోవైపు మైలవరంలో కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాల మధ్య పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరికి సీటు కేటాయిస్తారనేది వేచి చూడాలి.