|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 02:14 PM
ఎంపీగా పోటీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు పార్టీ పెద్దలు తనను ఎంపీగా పోటీ చేయాలని కోరారని తెలిపారు.
తనకు మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని పవన్ తన మనసులో మాట చెప్పారు. ఎంపీగా పోటీ చేస్తానో? లేదో? కొద్దిరోజుల్లో తెలుస్తుందన్నారు. బీజేపీకి సీట్లు ఇవ్వడం వల్లే జనసేన ఎక్కువ సీట్లు నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.