|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:11 AM
మహిళల కోసం సరికొత్త పథకం 'కలలకు రెక్కలు' పేరుతో కొత్త కార్యక్రమానికి తెలుగు దేశం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పేరు నమోదు చేసుకోవడం కోసం kalalakurekkalu.com వెబ్‌సైట్‌ను టీడీపీ రూపొందించింది. మహిళలకు చేయూతనిచ్చేందుకు కలలకు రెక్కల పథకాన్ని తీసుకొచ్చారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించ మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు అన్న ఆశయంతో 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా కోర్సు కాలానికి ఋణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కార్యక్రమం విధివిధానాలను ఈరోజు (బుధవారం) మీడియా ముందు వెల్లడించే అవకాశం ఉంది. ఆడబిడ్డల సంక్షేమం కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని రూపొందించారు.
Latest News