|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 06:02 PM
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్‌మీడియా ట్రోల్స్‌కు మానసికంగా కుంగిపోయి.. బాధతో ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమన్నారు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్‌మీడియా ట్రోల్స్‌తో ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం విన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్న ఆడబిడ్డలు చనిపోయిన తల్లి పార్థివ దేహం వద్ద నిల్చొని ఏడుస్తుంటే.. చూసిన ప్రతీ ఒక్కరూ చలించి పోయారన్నారు. ఒక తల్లిగా నేను ఈ సంఘటనను ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నానని, ఇంతటి హృదయవిదారక ఘటనను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు.
Latest News