|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 04:42 PM
డీఎస్సీ 2024 షెడ్యూల్ విషయంలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 14 రోజుల పాటు రెండు సెషన్స్‌లో పరీక్షల నిర్వహణ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
Latest News