|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:54 PM
నర్సీపట్నం మున్సిపాలిటీ జోగునాదినిపాలెం వద్ద అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టౌన్ ఎస్ఐ సుధాకర్ బుధవారం తెలిపారు. మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన లాలం శ్రీనివాస్ అనే వ్యక్తి బెల్టు షాపు ద్వారా అమ్మకాలు చేపట్టడానికి 11 మద్యం బాటిల్స్ తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బెల్ట్ షాపుల పై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలిపారు.
Latest News