|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 08:51 PM
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గతంలో బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెళతాడని విమర్శించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉన్నందునే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ బలహీనతకు చంద్రబాబు ఈ పర్యటనే నిదర్శనమన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీని పటిష్టంగా మార్చేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముమ్మర ప్రయత్నంగా కనిపిస్తోందని సజ్జల అన్నారు.
Latest News