|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:08 PM
మాజీ మంత్రి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్ మృతి చెందారు. ఐదు రోజుల క్రితం చంద్రశేఖర్ అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చంద్రశేఖర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు గత అర్థరాత్రి తీవ్ర గుండెపోటు వచ్చింది. వైద్యులు చికిత్సను అందిస్తుండగానే చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచారు. ఆయన అనారోగ్యం పాలైన నాటి నుంచి కూడా దేవినేని ఉమ సైతం సోదరుడి వద్దే అపోలో ఆసుపత్రిలోనే ఉంటున్నారు. ఇవాళ సాయంత్రం కంచికచర్లలో చంద్రశేఖర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Latest News