|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 10:49 AM
మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే చంద్రబాబును కలిసి పార్టీలో ఆయన చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖరరెడ్డికి సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న నాయకుడిగానే కాకుండా, బలమైన నేతగా పేరుంది. మొదట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బైరెడ్డి, 2009 తర్వాత పార్టీని వీడారు.