ఈ ప్రభుత్వంలో పోలీసులకి రక్షణ లేకుండా పోయింది
 

by Suryaa Desk | Tue, Feb 06, 2024, 03:09 PM

స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే ఈ  ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని, ఎర్ర చందనం దొంగల దాడిలో పోలీసులు చనిపోవడం బాధాకరమని తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల స్మగ్లింగ్‌కు అడ్డురాకుండా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్‌ను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం దొంగల చేతిలో పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరమన్నారు. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులు చేయడంపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన పోలీసులను స్మగ్లర్లు తమ వాహనంతో ఢీ కొట్టారని, ఈ క్రమంలో వారిని అడ్డుకోబోయిన 14వ బెటాలియన్ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందడం బాధాకరమని అన్నారు. 

Latest News
BRS asks cadres to hoist party flags in every village on formation day Sun, Apr 26, 2026, 05:41 PM
'Gunman carried shotgun, knives,' police say after shooting at White House event Sun, Apr 26, 2026, 05:38 PM
'A dangerous profession’: Many US presidents have faced assassination attempts Sun, Apr 26, 2026, 05:37 PM
BJP chief Nitin Nabin calls Rahul Gandhi 'part-time politician' Sun, Apr 26, 2026, 05:14 PM
IPL 2026: Fast bowling is a tough art, but I'm enjoying it, says Jamie Overton Sun, Apr 26, 2026, 04:38 PM