|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 03:09 PM
‘‘నిజం గెలివాలి’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ పర్యటన సాగనుంది. ఏడుగురు కార్యకర్తల కుటుంబాలను భువనమ్మ పరామర్శించనున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల గ్రామానికి భువనేశ్వరి చేరుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో భువనేశ్వరి కు ప్రజలు స్వాగతం పలికారు.
Latest News