|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:29 PM
టీడీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. సభ ప్రారంభం నుంచి ధరల పెరుగుదలపై చర్చ జరగాలని టీడీపీ నేతలు నిరసన చేపట్టారు.
అయితే టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించడంతో పేపర్లు వేస్తూ పోడియం దగ్గర టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ సభ్యులపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్ అయ్యారు. సభలోకి రౌడీలు, రోడ్ సైడ్ బ్యాచ్ వచ్చారంటూ ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వాయిదా వేశారు.