|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:28 PM
థానేలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. గత వారం ఆదివారం రాత్రి లూయిస్ వాడి ప్రాంతంలోని సాయినాథ్ నగర్‌లోని ఓ మహిళకు ఇంటి బయట ఆడ శిశువు కనిపించింది.
దీంతో ఆ మహిళ భయంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే ఇంటికి చేరుకుని పాపను థానే సివిల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.