|
|
by Suryaa Desk | Tue, Feb 06, 2024, 12:26 PM
అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదమేనని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో పొందుపరిచి పార్లమెంట్ ఆమోదం పొందినట్లయితే ఏపీకి చట్టబద్ధంగా హోదా లభించేదని విజయసాయి అన్నారు.